బలహీన వర్గాలకు జగన్‌తోనే మేలు | - | Sakshi
Sakshi News home page

బలహీన వర్గాలకు జగన్‌తోనే మేలు

Sep 14 2026 12:14 AM | Updated on Sep 14 2026 12:14 AM

రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే మేలు జరిగింది. భవిష్యత్‌లోనూ ఆయన పాలనలోనే సంక్షేమ ఫలాలు, రాజ్యాధికారం ద క్కుతాయి. మార్కెట్‌, దేవాలయ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాన్యులను అందలం ఎక్కించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జగన్‌ ప్రయత్నిస్తే కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గక 40 శాతం మేర సీట్లు కేటాయించి పెద్ద మనసు చాటుకున్నారు. మహిళలకైతే 50 శాతం పదవులు కేటాయించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎందరికో అవకాశమిచ్చారు. బీసీలు, శెట్టి బలిజలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని ఉత్తరం రాసి న దుర్మార్గుడు చంద్రబాబు. 34 శాతం రిజర్వేషన్లు ఇస్తానని బాబు మరోసారి మోసం చేస్తున్నాడు.

– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

బీసీలకు రాజ్యాధికారం కావాలి

సంపద సృష్టించే బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నదే జగన్‌ ఏకై క లక్ష్యం. 2029 ఎన్నికల్లో మనందరికీ అంతిమ పోరాటం. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో అధిక పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు సాధించాలి. అప్పడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు రాజ్యాధికారం సాధించవచ్చు.

– కుడిపూడి సూర్యనారాయణ, ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement