కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

అమలాపురం టౌన్‌: పాతికేళ్లుగా అసంపూర్తిగా, నత్తనడకన సాగుతున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్‌) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వచ్చిన సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్‌కు అవసరమైన భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలని కోరారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.1,200 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. భూ సేకరణకు సంబంధించి అన్ని కేసులపై స్టేలను కోర్టులు తొలగించినందున ఈ రైల్వే ప్రాజెక్ట్‌కు సమస్యలు దాదాపు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైల్వే లైన్‌ను తొందరగా పూర్తి చేసి, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు డాక్టర్‌ ఈఆర్‌ సుబ్రహ్మణ్యం, సప్పా నాగేశ్వరరావు, ఎరగర్త వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శివాజీ తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement