రాజోలు: మోటార్ సైకిల్ ఢీకొట్టిన ఘటనలో ఓ వివాహిత మృతి చెందింది. రాజోలు ఎస్సై మల్లికార్జునరెడ్డి కథనం ప్రకారం.. సోంపల్లి గ్రామానికి చెందిన కొల్లు దుర్గాప్రసాద్, పూజ (28) దంపతులు. వీరు రాజోలు నుంచి సోంపల్లిలో తమ ఇంటికి మోటార్ సైకిల్‌పై వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో వెనుక నుంచి మొండెపులంక గ్రామానికి చెందిన ఒక యువకుడు మోటారు సైకిల్‌తో బలంగా ఢీకొట్టాడు. దీంతో కొల్లు పూజ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఆమెను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
రాజానగరం: దివాన్‌చెరువు నుంచి శ్రీరామపురం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఉన్న ఓ లేఅవుట్‌లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న బొమ్మూరు సీఐ పి.కాశీవిశ్వనాథ్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, మృతుని వివరాల కోసం అన్వేషించారు. 50 ఏళ్ల పైబడిన వ్యక్తిగా ఉన్న అతను చేతికి స్టీల్ కడియం, చేతిపై ‘లవ్’ సింబల్, మరో చేతిపై ‘హాయ్’ అనే హిందీ అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే 94407 96587, 93477 41118 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.


