యువత సమస్యలపై 28న నిరసన ర్యాలీలు | - | Sakshi
Sakshi News home page

యువత సమస్యలపై 28న నిరసన ర్యాలీలు

Jul 25 2026 12:11 AM | Updated on Jul 25 2026 12:11 AM

రాజమహేంద్రవరం సిటీ: విద్యార్థు లు, నిరుద్యోగ యువత సమస్యలపై ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యువజన, విద్యార్థి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతో లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణతో పారదర్శకమైన విచారణ చేయించాలని, ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చే శారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని, డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

ఆగస్టు 8న పలు రైళ్ల రద్దు

రాజమహేంద్రవరం సిటీ: సాంకేతిక మరమ్మతుల కారణంగా ఆగస్టు 8వ తేదీన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. విశాఖపట్నం – కాకినాడ పోర్ట్‌ (17268), కాకినాడ పోర్ట్‌ – విశాఖపట్నం (17267), విశాఖపట్నం – రాజమహేంద్రవరం (67286), రాజమహేంద్రవరం – విశాఖపట్నం (67285) రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement