నేడు జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

నేడు జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా జిమ్నాస్టిక్స్‌ సంఘం ఽఆధ్వర్యంలో శనివారం కాకినాడ డీఎస్‌ఏ జిమ్నాజియంలో రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు విఠల్‌ శుక్రవారం తెలిపారు. జూనియర్‌ బాలురు, బాలికల విభాగంలో ఆర్టిస్టిక్‌ విభాగంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24న ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌ పోటీలలో రాష్ట్రం తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు.

మళ్లీ శాప్‌ అకాడమీలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలో రాష్ట్ర స్థాయి అకాడమీలను తిరిగి ప్రారంభిస్తుందని డిఎస్‌డీఓ వి.సతీష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి శాప్‌ నుంచి ఆదేశాలు అందాయన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి వెయిట్‌ లిఫ్టింగ్‌లో 15, జిమ్నాస్టిక్స్‌లో 15, హాకీలో 20, ఖోఖోలో 20 మంది బాలికలకు ప్రవేశం కల్పించనున్నారు. 19 సంవత్సరాలలోపు వారు 1–1–2008 నుంచి 1–1–2011 మధ్య జన్మించిన వారు ప్రవేశానికి అర్హులు. ఎంపికై న వారికి కోచింగ్‌, వసతి, భోజన, ఆధునిక శిక్షణ సదుయాలు కల్పిస్తారన్నారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో ఈ శాప్‌ అకాడమీలు ప్రారంభమవుతాయన్నారు. విశాఖలో అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, సైక్లింగ్‌లో బాలుర, అకాడమీలు, తిరుపతిలో బాలురు, బాలికలకు జుడో, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిిఫ్టింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌లో అకాడమీలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. కాకినాడలో ఈ నెల 29న వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌లో, 30న హాకీ, ఖోఖోలో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. వివరాలకు 9440031601 నంబరులో సంప్రదించాలని కోరారు.

మూల్యాంకనం త్వరగా పూర్తిచేయాలి

ఆర్జేడీ నాగమణి

అమలాపురం టౌన్‌: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్దేశిత సమయంలోనే త్వరగ పూర్తి చేయాలని విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఈవో పి. నాగేశ్వరరావు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీవైఈవోలు జి.సూర్య ప్రకాశం, లక్ష్మణమూర్తి, కె.వెంకటేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ బీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

13న మినీ ఉద్యోగ మేళా

అమలాపురం రూరల్‌: ఈ నెల 13వ తేదీ సోమవారం కలెక్టరేట్‌ వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. తమిళనాడులోని హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 19–35 ఏళ్ల మధ్య ఉన్న మహిళా అభ్యర్థులు ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ పీజీ పూర్తి చేసిన వారు తమ బయోడేటాతో హాజరు కావాలని వికాస జిల్లా మేనేజర్‌ గోళ్ల రమేష్‌ తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికై న అభ్యర్థులకు జాయినింగ్‌ ఆర్డర్లు ఇస్తామని తెలిపారు.

సిబ్బంది సమస్యలపై

‘ఎస్పీ సంపర్క్‌’

అమలాపురం టౌన్‌: పోలీస్‌ సిబ్బంది బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు, ఇతర సర్వీస్‌ సమస్యలపై జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ‘ఎస్పీ సంపర్క్‌’ను శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పోలీసులు కొందరు నేరుగా, మరికొందరు ఫోన్ల ద్వారా ఎస్పీతో తమ సమస్యలను చెప్పుకొన్నారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లను అధిగమించేందుకు సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement