సత్యదేవునికి వెండి శఠగోపం | - | Sakshi
Sakshi News home page

సత్యదేవునికి వెండి శఠగోపం

Mar 20 2026 8:01 AM | Updated on Mar 20 2026 8:01 AM

అన్నవరం: సత్యదేవునికి ఎన్‌కే కిరణ్మయి (హైదరాబాద్‌) తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం 810 గ్రాముల బరువు, రూ.1.50 లక్షల విలువైన వెండి శఠగోపం, వెండి పళ్లెం సమర్పించారు. వీటిని దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ త్రినాథరావులకు అందజేశారు. వీటిని స్వామివారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించాలని ఆమె కోరారు. ఆ మేరకు ఈఓ ఆదేశాలు జారీ చేశారు.

గోకవరంలో అకాల వర్షం

గోకవరం: మెట్ట ప్రాంతమైన గోకవరం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ ప్రభావం ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. చల్లటి గాలులు వీయడంతో కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు సేద తీరారు. ఈ భారీ వర్షం కారణంగా మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు.

ప్రభుత్వాసుపత్రిలో

తాగుబోతు వీరంగం

సెక్యూరిటీ గార్డుపై అర్ధరాత్రి కత్తితో దాడి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ తాగుబోతు కత్తితో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల సమక్షంలోనే అతడు దాడి చేస్తూంటే బాధితుడు చేయి అడ్డు పెట్టాడు. దీంతో, అతడి చేయి, తలపై కత్తి వేట్లు పడ్డాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సీటీఆర్‌ఐకి చెందిన కడగల సూర్యప్రకాశరావు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు బుధవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. దేశాబత్తుల చిన్నారావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు అక్కడకు వచ్చాడు. అతను పదేపదే రోగి వద్దకు వెళ్లి, వస్తూండటంతో అక్కడ తిరగవద్దని సెక్యురిటీ గార్డు సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఆ రోగి బంధువులు ఆసుపత్రిలో ఫుల్‌గా మద్యం తాగారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డుకు, రోగి బంధువు చిన్నారావుకు మళ్లీ వాగ్వాదం జరిగింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేటు బయట ఉన్న చిన్నారావును పిలుచుకు రావాలని వారు సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. అతడు వెళ్లి పిలుస్తూండగానే.. ముందుగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో అతడిపై చిన్నారావు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డును వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్సలు అందించారు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement