
పలుకుపడి ఉంటేనే పూజ
రెండు రోజులుగా వస్తున్నా..
రెండు రోజులుగా ఒక్క పాస్ కోసం ఇక్కడే ఆలయం వద్ద పడిగాపులు కాశాను. అయినా దొరకలేదు. కేవలం పది నిమిషాలు మాత్రమే 50 పాస్‌లు ఇచ్చి అయిపోయాయని చెబుతున్నారు. నేను కరప నుంచి వచ్చాను. అయినా పాస్ దొరకలేదు.
– వీరలక్ష్మి, భక్తురాలు
కావాల్సిన వారికే ఇస్తున్నారు
ఆలయంలో వారికి కావాల్సిన వారికి మాత్రం దొంగచాటుగా అన్ని పాస్‌లు ఇస్తున్నారు. కానీ రోజుల తరబడి క్యూలో ఉన్నవారికి మాత్రం ఒక్క పాస్ కూడా ఇవ్వలేదు. పాస్‌లు అడిగితే సెక్యూరిటీ సిబ్బందితో బయటకు గెంటించి వేస్తున్నారు.
– ప్రమీల, భక్తురాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పలుకుబడి ఉంటేనే పూజ అన్నట్లు చేశారు.. ఎంతో భక్తితో నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకూ రాజకీయ రంగు పులిమేశారు.. దీంతో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ పూజల్లో పాల్గొనేందుకు పాస్‌ల కోసం వచ్చిన మహిళలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గంటల తరబడి వేచి ఉన్నా పాస్‌లు అయిపోయాయని చెప్పడంతో ఆందోళనకు దిగారు. కాకినాడ బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. దీనికోసం గురువారం పాస్‌లు పంపిణీ చేశారు. కేవలం 100 పాస్‌లు ఇచ్చి మొత్తం అయిపోయాయని చెప్పడంతో ఉదయం నుంచి అక్కడ వేచిఉన్న మహిళలు ఆందోళనకు దిగారు. కేవలం సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ పాస్‌లు ఇచ్చి, మిగిలిన వారికి ఇవ్వడం లేదని మహిళలు బహిరంగానే చెప్పారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు ఒక్కొక్కరికి 5 నుంచి 10 పాస్‌లు ఇచ్చారని, తాము మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు కాసినా ఒక్క పాస్ కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆలయంలో శుక్రవారం మహిళలు పూజలు చేసుకునేందుకు సుమారు 2,500 పూజా సామాన్లు కిట్లు సిద్ధం చేశామని, తమకు కూడా పాస్‌లు ఇవ్వలేదని అక్కడ సేవ చేసే మహిళలు సైతం ఆలయ సిబ్బందితో గొడవకు దిగారు.
వేచి ఉంచి.. వెనక్కి పంపించి
బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయనేది నమ్మకం. అందుకే ఇక్కడ పూజల కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. రెండు రోజులుగా పాస్‌ల కోసం భక్తులు ఇక్కడ తిష్టవేసినా ఒక్క పాస్ కూడా భక్తులకు ఇవ్వకుండా పచ్చ నాయకులకు మాత్రం దొడ్డిదారిన పాస్‌లు ఇచ్చి పంపారు. దేవదాయ శాఖ అధికారులు సైతం ఇక్కడ పాస్‌లు లేవని, కావాల్సిన వారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్యాలయానికి వెళ్లాలని చెప్పడం గమనార్హం. పాస్‌లన్నీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిపోయాయని, ఈ మాత్రం దానికి ఎందుకు ఇలా పడిగాపులు కాసేలా చేశారని మహిళలు మండిపడ్డారు.
బయటకు పంపించేసి..
పాస్‌ల కోసం మహిళలు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జీ కార్యాలయం, ఈఓ ఉండవల్లి వీర్రాజు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచిఉన్నారు. ఎంతసేపటికి పాస్‌లు ఇవ్వకపోవడంతో వారు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చోవడమే కాకుండా ఈఓ రావాలి, పాస్‌లు ఇవ్వాలని నినాదాలు చేశారు. అదే సమయంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ బయటకు రావడంతో మహిళలు ఆయనను చుట్టుముట్టారు. పాస్‌లు ఇవ్వకుండానే ఆయన ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది పాస్‌లు అయిపోయాయని, బయటకు వెళ్లిపోవాలంటూ మహిళలను దౌర్జన్యంగా ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపించేశారు.
ఫ సామూహిక వరలక్ష్మీ
వ్రతాలకు రాజకీయ రంగు
ఫ పచ్చ నేతలకే పాస్‌లు
ఫ ఆలయం వద్ద మహిళల నిరసన

పలుకుపడి ఉంటేనే పూజ

పలుకుపడి ఉంటేనే పూజ