
సారా రహితంగా మార్చుదాం
ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్‌ను సారా రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని రూపొందించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.కృష్ణకుమారి అన్నారు. ప్రత్తిపాడు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో నవోదయం కార్యక్రమానికి 136 గ్రామాలను ఎంపిక చేశారన్నారు. ఇప్పటికే 129 గ్రామాల్లో సారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, దుష్ప్రభావాలను వివరించామన్నారు. సారా అమ్మడం, తయారు చేయడం, రవాణా చేయడం, కలిగి ఉండటం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో ప్రత్తిపాడు, తుని ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ఎక్కువగా సారా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. సిబ్బంది విషయానికొస్తే 55 శాతం పోస్టులు భర్తీ కావాల్సి ఉందని వివరించారు. సమావేశంలో ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్త, ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ పాల్గొన్నారు.