
కన్నబాబుకు పేర్ని నాని పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ పీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబును మాజీ మంత్రి పేర్ని నాని గురువారం పరామర్శించారు. కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన సంగతి విధితమే. కాకినాడ వైద్యనగర్ నివాసంలో సత్యనారాయణ చిత్ర పటానికి పేర్ని నాని నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కన్నబాబు, ఆయన సోదరుడు సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణలను ఓదార్చారు. కన్నబాబును పరామర్శించిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ మాధవి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి భాగ్యలక్ష్మి, విజయనగరం మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, చుండ్రు శ్రీహరి, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, బండారు సత్యానందరావు, మారిశెట్టి రాఘవయ్య, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఒమ్మి రఘురామ్ తదితరులు ఉన్నారు.