వనదుర్గమ్మ శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వనదుర్గమ్మ శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

Aug 5 2025 6:43 AM | Updated on Aug 5 2025 6:43 AM

వనదుర్గమ్మ శ్రావణ  మాసోత్సవాలు ప్రారంభం

వనదుర్గమ్మ శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

అన్నవరం: రత్నగిరి దుర్గామాత వనదుర్గ అమ్మవారి శ్రావణ మాస జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారిని తొలి రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి, పండితులు పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్య నమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు, బాల, కన్య, సువాసినీ పూజలు, చండీ పారాయణలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. ఆలయ వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, 44 మంది రుత్విక్కులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సత్యదేవుని తరఫున ఈఓ దంపతులు చీర, సారె సమర్పించారు. ఈ నెల తొమ్మిదో తేదీ పౌర్ణమి వరకూ ఈ ఉత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement