ఫుడ్‌ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

Nov 12 2026 12:49 AM | Updated on Nov 12 2026 12:49 AM

అలంపూర్‌: జాతీయ రహదారి పక్కనున్న రెస్టారెంట్లు, హోటళ్లలో బుధవారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. టీజీ సేఫ్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ విజయ్‌ కుమార్‌, డీఓలు నీలిమ, నాయక్‌, ఎఫ్‌ఎస్‌ఓ కరుణాకర్‌తో కూడిన బృందం అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఉన్న లేపాక్షి, కంచి కేఫ్‌, తాజ్‌ హోటల్‌తో పాటు సమీపంలోని ఉన్న దొడ్ల పాల డెయిరీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కంచి కేఫ్‌, లేపాక్షి రెస్టారెంట్ల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఓ తెలిపారు. నోటీసులు అందుకున్న రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలను సరి చేసుకోవడానికి నిర్ణీత సమయం ఉంటుందని.. అప్పటికీ మార్పు లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement