రైస్‌మిల్లులో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లులో తనిఖీలు

Nov 12 2026 12:49 AM | Updated on Nov 12 2026 12:49 AM

● రూ.8కోట్ల విలువైన ధాన్యం మాయం

గద్వాల: ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సివిల్‌ సప్లయ్‌శాఖ అధికారులు చేపట్టిన దాడుల్లో రూ. 8కోట్ల విలువైన ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. డీసీఎస్‌ఓ స్వామికుమార్‌ వివరాల మేరకు.. అలంపూర్‌ చౌరస్తాలోని జోగుళాంబ రైస్‌ మిల్లుకు గత వానాకాలంలో 2125.480 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించి రైస్‌మిల్లర్‌ ప్రభుత్వానికి సీఎంఆర్‌ పెట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యంలో 80వేల బస్తాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, రూ. 8కోట్లు సొమ్ము చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సమగ్ర నివేదిక తయారు చేసి, ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు స్వామికుమార్‌ పేర్కొన్నారు. వారి ఆదేశాల మేరకు సంబంధిత రైస్‌మిల్లర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’కి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు..

పేదలకు వరం

గట్టు: గూడు లేని నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు ఓ వరమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం గట్టు మండలం చిన్నోనిపల్లెలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన హాజరై మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 2వేల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తిచేసి, గృహప్రవేశాలు చేయాలని ఆయన కోరారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దేవేందర్‌, మాజీ ఎంపీపీ విజయకుమార్‌, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్‌, నర్సింహులు, ఉప్పరి శ్రీనివాసులు, రామచంద్రగౌడ్‌, జయరాంగౌడ్‌, తిమ్మప్ప, మధుసూదన్‌రెడ్డి, నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, అన్మిరెడ్డి, బసిరెడ్డి, బజారి, బోయ తిమ్మప్ప, నాగరాజు, ఇంజన్న తదితరులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.10,042

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 518 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 10,042, కనిష్టంగా రూ. 4,359, ధర పలికింది. అలాగే 11 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 7,739, కనిష్టంగా రూ. 7,719 ధరలు లభించాయి. 654 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 3,359, కనిష్టంగా రూ. 2,769, సరాసరి రూ. 3,272 ధరలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement