మల్దకల్: విద్యార్థుల భవిష్యత్‌కు ఇంటర్ విద్య ఎంతో కీలకమని జిల్లా నోడల్ అధికారి హృదయరాజు అన్నారు. శనివారం మల్దకల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాల్యం నుంచి బాధ్యత గల భవిష్యత్‌కు విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. అదేవిధంగా గురువులను గౌరవించడం, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండటంతోపాటు సమాజం పట్ల సేవా దృక్పథంను కలిగి ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. అలాగే మార్కులు మాత్రమే కాకుండా సంస్కారంతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం కళాశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు గోవర్ధన్శెట్టి, నర్సింహులు, రామాంజనేయులుగౌడ్, భాగ్యలక్ష్మి, రాఘవేంద్ర, సుధాకర్, శ్రీకాంత్, మాధురి, రంగస్వామి, ఇఫ్తాకర్, కమలహాసన్, విద్యార్థులు పాల్గొన్నారు.


