గద్వాల క్రైం: నేరస్తులకు న్యాయస్థానా ల్లో శిక్ష పడేలా కోర్టు విధులు నిర్వహిస్తు న్న సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నా రు. శనివారం ఎస్పీ కార్యాలయంలో కోర్టు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా పరిధిలోని న్యాయస్థానాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కేసుల వేగవంతం, సాక్షులు, అవసరమయ్యే సాక్షులను న్యాయస్థానాల్లో హాజరయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల చార్జీషీట్లను అనుకున్న గడువులోగా విచారణ అధికారుల నుంచి నివేదికలను నిర్లక్ష్యం చేయకుండా తీసుకోవాలన్నారు. బాధితులకు పోలీసు శాఖపై నమ్మకం కలిగేలా వ్యవహరించాలని చెప్పారు. వివిధ కేసులలో బెయిల్ పొంది కోర్టుకు హాజరుకాలేని నిందితులను గుర్తించి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


