రైస్‌మిల్లర్ల అవినీతిపై విచారణకు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లర్ల అవినీతిపై విచారణకు ఆదేశం

Nov 2 2026 12:23 AM | Updated on Nov 2 2026 12:23 AM

గద్వాల: ప్రభుత్వ సొమ్మును దర్జాగా దోచేస్తున్న రైస్‌మిల్లర్ల అవినీతి బాగోతంపై ఈ నెల 1న ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన ‘నల్లగొండ టు కౌకుంట్ల’ కథనానికి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ స్పందించారు. ఈ మేరకు కౌకుంట్ల గోదాంలో రెండు మిల్లులకు సంబంధించిన ధాన్యం నిల్వలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదిక సమర్పించాలని సివిల్‌ సప్లయ్‌ డీఎం విమలను ఆదేశించారు. అదే విధంగా అక్రమాలకు పాల్పడుతున్న రైస్‌ మిల్లర్లకు కొమ్ముకాస్తున్న సంబంధిత అధికారిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. పూర్తి నివేదిక అనంతరం అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. కాగా, అవినీతి వ్యవహారంపై ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి బెంబేలెత్తిపోయిన సదరు మిల్లర్లు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఉన్నతాధికారులు అక్రమాలను నిగ్గుతేల్చుతారా.. లేక గోనె సంచుల కింద కప్పేస్తారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement