పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Nov 2 2026 12:23 AM | Updated on Nov 2 2026 12:23 AM

మల్దకల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్‌ మండలంలోని మేకలసోంపల్లి, పావనంపల్లి గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసి పథకాలు అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా బిల్లులు జమ చేయడం జరుగుతుందన్నారు. గద్వాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసినట్లు చెప్పారు. త్వరలోనే రెండో విడత ఇళ్లను అర్హులకు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, విక్రంసింహారెడ్డి, రాజారెడ్డి, విజయ్‌, ప్రభాకర్‌రెడ్డి, జయరాములు, విష్ణు, భరత్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, అజయ్‌, వెంకటన్న, జయరాములు, జీవన్‌రెడ్డి, శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement