కేసుల విచారణలో వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల విచారణలో వేగవంతం చేయాలి

Oct 29 2026 12:36 AM | Updated on Oct 29 2026 12:36 AM

గద్వాల క్రైం: గద్వాల సర్కిల్‌ పరిధిలోని గద్వాల, గద్వాల రూరల్‌, ధరూరు, గట్టు, కేటీదొడ్డి, మల్దకల్‌ పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసులపై వేగవంతంగా విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం వార్షిక తనిఖీలో భాగంగా గద్వాల సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్‌ కేసుల వివరాలను సీఐ శ్రీనును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను సిబ్బందితో ఆరా తీశారు. పోక్సో కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా నిందితులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వీలైనంత త్వరగా చార్జిషీట్‌ దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా నివేదికలను న్యాయస్థానంలో అందజేయాలన్నారు. చోరీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సైబర్‌ కేసులు, హత్యలు, మిస్సింగ్‌, దాడులు, చీటింగ్‌ తదితర కేసుల వివరాలపై ఆరాతీశారు. బాధితులకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగిలయ్య, సిబ్బంది తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement