గద్వాల: వినియోగదారుల హక్కుల పరిరక్షణపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆసరా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఆసరా ఆధ్వర్యంలో నవంబర్ 27, 28 తేదీల్లో గోవాలో నిర్వహించనున్న 8వ జాతీయ సదస్సు వాల్పోస్టర్ బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సదస్సులో వినియోగదారుల హక్కులు, న్యాయ పరిరక్షణ, సమస్యలు– పరిష్కార మార్గాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. వస్తువు కొనుగోలు సమయంలో బిల్లు తీసుకోవడం, ఎమ్మార్పీ పరిశీలించడం, మోసాలపై ఫిర్యాదు చేయడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తేవడమే సంస్థ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆసరా జిల్లా అధ్యక్షుడు భరత్, ఉపాధ్యక్షుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


