శాంతియుత సమాజమే లక్ష్యం: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

శాంతియుత సమాజమే లక్ష్యం: ఎస్పీ

Oct 22 2026 12:33 AM | Updated on Oct 22 2026 12:33 AM

గద్వాల క్రైం: శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పరేడ్‌ మైదానంలో పోలీసు అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులను నిలువరించడంలో పోలీసుల కృషి ఎనలేనిదన్నారు. చట్టాలను అమలు చేయడం, కేసుల పారదర్శక విచారణతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే వ్యవస్థ పోలీసుశాఖ అని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్‌రావు, సీఐలు టంగుటూరి శ్రీను, ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.7,200

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 73 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,200, కనిష్టంగా రూ. 4,520 ధర పలికింది. అలాగే 21 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 7,669, కనిష్టంగా రూ. 7,529, సరాసరి రూ. 7,569 ధరలు లభించాయి.

జములమ్మకు

బంగారు హారం

గద్వాలన్యూటౌన్‌: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారికి బుధవారం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌కు చెందిన రాజశేఖర్‌ దంపతులు 10 గ్రాముల బంగారు హారాన్ని బహుకరించారు. అమ్మవారి సన్నిధిలో ఈఓ పురందర్‌ కుమార్‌కు హారాన్ని అందజేయగా.. అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాతలకు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement