తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు, అధిక ఉష్ణోగ్రతలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పంటల పూతలు రాలిపోవడంతో పాటు ఆకుల రంగుల మారాయి. చాలా వరకు వాడుపట్టాయి. వీటన్నింటి కారణంగా దిగుబడులు తగ్గే పరిస్థితులు ఉన్నాయి.
– వీరప్ప, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
కంది చేతికొచ్చే పరిస్థితి లేదు..
రెండు ఎకరాల్లో కందిపంట వేశాను. వర్షాలు లేకపోవడంతో పంట పెరగడం లేదు. దీనికితోడు నెల రోజుల నుంచి ఎండలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పంట వాడుముఖం పట్టింది. పూతలు రాలుతున్నాయి. వాతావరణం ఇలాగే ఉంటే కంది పంట ఏమాత్రం చేతికి రాదు. – సురేంద్ర, రైతు,
చింతలకుంట, కేటీదొడ్డి మండలం
పత్తి, మిరప ఎండిపోతున్నాయి..
ఎకరాకు రూ. 23వేల చొప్పున 38 ఎకరాలు కౌలుకు తీసుకుని 15 ఎకరాల్లో మిరప, 18 ఎకరాల్లో పత్తి వేశాను. వర్షాలు లేకపోవడం, మూడు బోర్లలో నీరు తగ్గడం, కరెంటు కోతలతో పత్తి, మిరప పంటలు వాడుబడుతున్నాయి. నీరు అందక మొక్కలు పెరగలేదు. ఎండలతో వాడుబడుతున్నాయి. రూ. 15లక్షల వరకు పెట్టుబడి అయింది.
– చిన్న మద్దిలేటి, రైతు, మానవపాడు
●


