మానవపాడు: గ్రామాల్లో చేపడుతున్న వీబీజీ రాంజీ పనుల్లో తప్పకుండా వందమంది హజరు అయ్యేలా ఫీల్డ్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం అన్నారు. గురువారం మండలంలోని బోరవెల్లి గ్రామంలో పెన్షన్ల సరిఫికెట్ వెరిఫికేషన్, వీబీజీ రాంజీ కూలీల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చండూరు, పల్లెపాడు పంచాయతీలలో పర్యటించి తప్పకుండా గ్రామాల్లో వందమంది ఉపాధి హామీ కూలీలు పాల్గొనాలని సూచించారు. చేయూత పెన్షన్ పింఛన్లను ఆయా గ్రామాల్లో పరిశీలించి అప్లికేషన్ వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు.


