ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీ ఏర్పడిన అనంతరం మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదట రూ.60 లక్షలతో హైదరాబాద్కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులు అప్పగించింది. ఆరు నెలలపాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. పుణె ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించి.. తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు.


