జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గింది. శుక్రవారం కేవలం 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ సుదర్శన్‌ తెలిపారు. గురువారం నాటికి నారాయణపూర్‌ డ్యాం నుంచి రోజువారీగా 5వేల క్యూసెక్కుల నీరు నాలుగు రోజులపాటు రావడం.. ఆపై వెయ్యి క్యూసెక్కుల నీరు రెండు రోజులపాటు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిందన్నా రు. జూరాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలతో పాటు ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌, సమాంతర కాల్వ, భీమా ఫేజ్‌–2కు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. అలాగే జూరాల ఆయకట్టుకు నాలుగు రోజులుగా సాగునీటి విడుదల నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement