సాధారణంగా అక్టోబరులో ఊపందుకునే పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి, మార్చి వరకు కొనసాగుతాయి. కానీ ఈసారి వర్షాభావంతో పంట ముందుగానే ఎండిపోవడం, కొత్త కాయలు వచ్చే అవకాశం తగ్గడంతో నవంబర్ చివరికే పత్తి ఏరడం పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దిగుబడి తగ్గడంతో జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి పరిమాణం కూడా పడిపోనుంది. పెట్టుబడి అవసరాలు, కొనుగోళ్ల పరిమితుల నేపథ్యంలో కొన్ని మిల్లులు డిసెంబర్లోపే కార్యకలాపాలు నిలిపివేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ధరలు ఆశాజనకంగా ఉన్నా.. పంట లేకపోవడంతో పత్తి రైతులకు ఈ సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చేలా ఉంది.
ఎర్రవల్లి మండలంలోని దువాసిపల్లిలో ఎండిన పత్తి పంట


