కొలువుదీరిన బొజ్జగణపయ్య | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన బొజ్జగణపయ్య

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

గద్వాలన్యూటౌన్‌: వినాయక చవితి ఉత్సవాలను సోమవారం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమా రు వెయ్యికి పైగా వినాయక ప్రతిమలను ప్రతి ష్ఠించారు. రంగురంగుల విద్యుద్దీపాలు, పలు రకాల పుష్పాలతో గణేశ్‌ మండపాలను శోభా యమానంగా తీర్చిదిద్ది.. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడికి ఇష్టమైన వంటకాలతో నైవేద్యాలు సమర్పించారు. వాడవాడలా భక్తి గీతాలు, భజనలతో హోరెత్తాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గణనాథులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయా మండపాల వద్ద పార్వతీ తనయుడికి ప్రత్యేక పూజలు చేశారు. సకాల విఘ్నాలు తొలిగి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. డీసీసీ అధ్య క్షుడు రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement