కాంగ్రెస్‌ పాలనలో విధ్వంసమైన వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో విధ్వంసమైన వ్యవసాయం

Sep 4 2026 1:00 AM | Updated on Sep 4 2026 1:00 AM

ధరూరు: రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్‌ విఫల పాలనలో వ్యవసాయం విధ్వంసం జరిగిందని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హన్మంతు అ న్నారు. ధరూరులోని సబ్‌స్టేషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని 12 గంటలకు పరిమితం చేశారని, అందులోనూ ఎడాపెడా కోతలు పెడుతున్నారని విమర్శించారు. రైతులకు మేలు జరిగింది అంటే అది కేవలం బీఆర్‌ఎస్‌ పాలనలో మాత్రమే అన్నారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు నామరూపాలు లేకుండా పోతాయని హెచ్చరించారు. అనంతరం గద్వాల విద్యుత్‌ డీఈతో ఫోన్‌లో మాట్లాడి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మండల ఏఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పద్మ, నాయకులు వెంకట్రాములు, రాఘవేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోనేష్‌, ప్రతాప్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వెంకటేష్‌నాయుడు, లక్ష్మీకాంత్‌రెడ్డి, భరతసింహారెడ్డి పాల్గొన్నారు.

ధరూరులో వైఎస్సార్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement