జిల్లాలో ఆర్డీఎస్ ఆయకట్టు అయిజ మండలం సింధనూరులోని 12–ఏ నుంచి మొదలై.. అలంపూర్ చివరిదాక ఉంది. ఆయకట్టు మొత్తం అలంపూర్ నియోజకవర్గంలోనే ఉండగా.. అధికార కార్యాలయాన్ని మాత్రం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. రైతులకు ఆర్డీఎస్ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో కనీస సమాచారం, ఆయకట్టుకు నీరందించే సమయ వివరాలు తెలుసుకునే వీలు లేకుండాపోయింది. ప్రత్యేకించి తుమ్మిళ్ల లిఫ్ట్ నుంచి కూడా నీటి విడుదల ఉంటుండటంతో రైతులకు తగిన సమాచారం అందించాల్సిన అవసరముంది.


