ఓటు హక్కు పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పరిరక్షణ అందరి బాధ్యత

Jul 23 2026 12:54 AM | Updated on Jul 23 2026 12:54 AM

గద్వాల: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హులు ఓటు హక్కు కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, జిల్లా ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి సిద్దేశ్వర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పార్టీ బీఎల్‌ఏలు కొత్త ఓటర్లను చేర్చడం.. ఉన్న ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను తిరిగి బీఎల్‌ఓలకు అందించేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలా పనిచేస్తామో అదే విధంగా ప్రతి కార్యకర్త తమ వార్డుల్లో నిరంతరం పనిచేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement