మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సమాజ సేవలో పీయూ ముందుంటుందని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మాపూర్‌లో పీయూఎంఎస్‌డబ్ల్యూ విభాగం, ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించేందుకు పీయూ తనవంతుగా సేవలు అందిస్తుందన్నారు. ఎక్కడికో వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోకుండా గ్రామానికి వచ్చిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని కోరారు. ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు పుస్తక విజ్ఞానంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలనిసూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, సర్పంచ్ రాజుగౌడ్, డాక్టర్లు పవన్‌కుమార్, సింధు, మణికంఠరాజు, ఆప్రీన్, విజయ, అంజని, మనోహర్, అధ్యాపకుడు గాలెన్న తదితరులు పాల్గొన్నారు.


