గద్వాలన్యూటౌన్: రాజ్యాంగబద్ధంగా నిరసన తెలి పిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వా మిక విలువలపై జరిగిన దాడికి నిదర్శనమని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, టీపీసీసీ ఇన్‌చార్జి సిద్దేశ్వర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాహుల్‌గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ.. బుధవారం స్థానిక వైఎస్సార్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణ లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. లక్షలాది విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయమైన చర్యన్నారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగా లని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి తిప్పికొడుతుందన్నారు. నీట్ అక్రమాలపై బాధ్యత గా ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని.. వారి రాజీనామా జరిగే వరకు గాంధే య మార్గంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, నాయకులు ధరూర్ రవి, ఇసాక్, నాగేంద్రయాదవ్, రామాంజనేయులు, సుదర్శన్, శ్రీనివాసులు, కిఫాయత్ తదితరులు పాల్గొన్నారు.


