గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

కేటీదొడ్డి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అన్నిరంగాల్లో పురోగమిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొండాపురం గ్రామంలో సుమారు రూ.1.05 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం వర్క్‌, హైస్కూల్‌, కౌంపౌండ్‌ వాల్‌, హాస్పిటల్‌, పంట గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అనంతరం కొండాపురం, వెంకటాపురం, పాగుంట, ముసల్‌దొడ్డి, ఇర్కిచేడు, గ్రామాల ప్రజల చిరకాల కోరిక అయిన ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని గద్వాల డీఎంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. ఎస్సీవాడలోని అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నూతనంగా ప్రారంభించిన బస్సు సర్వీసు ద్వారా ఐదు గ్రామాల ప్రజలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో గ్రామానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement