గోదావరి పుష్కరాలకు రూ.వెయ్యి కోట్లు | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు రూ.వెయ్యి కోట్లు

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

● రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ హన్మంతురావు

తిమ్మాజిపేట: తెలంగాణలో గోదావరి పుష్కరాల నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ హన్మంతురావు అన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తిమ్మాజిపేట మండలంలోని అప్పాజిపల్లి నర్సన్నగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామిని శనివారం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, చిలుక రాజేందర్‌రెడ్డి, జిల్లా దేవాదాయశాఖ అధికారులతో కలిసి కమిషనర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గోదావరి 560 కి.మీ., మేర ప్రవహిస్తుందని, పుష్కరాల ఏర్పాట్లతోపాటు ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బాసర సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.324 కోట్లు, దాతల సహకారంతో మరో రూ.30 కోట్లతో కలిపి సుమారు రూ.350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భద్రాచలం ఆలయానికి రూ.274 కోట్లు, కాళేశ్వర ఆలయానికి రూ.194 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, పురాతన, శిథిలావస్థలో ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement