రాజోళి: వడ్డేపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.రామ ఓబులేషు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు 2, పొలిటికల్ సైన్స్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ 1, జువాలజీ 1, ఇంగ్లిష్ 1, కామర్స్ 1, బోటనీ 1, కెమెస్ట్రీ 1 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఓసీ, బీసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.8,026
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 239 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,026, కనిష్టంగా రూ. 2,711, సరాసరి రూ. 5,769 ధరలు పలికాయి.
23న చలో హైదరాబాద్
గద్వాలన్యూటౌన్: సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లస్వామి తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బయాలజీ ఉపాధ్యాయుల శిక్షణ భోజన విరామ సమయంలో చలో హైదరాబాద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 23న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మహేశ్, రజని కుమార్, పరమేశ్, పుల్లయ్య, మోహన్, అరవింద్ పాల్గొన్నారు.
అవకాశాలను
అందిపుచ్చుకోవాలి
గద్వాల: విద్యార్ధులు, యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూరల్ సెల్ప్ ఎంప్లాయిమెంట్ ట్రెనింగ్ ఇనిసిస్ట్యూట్ ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంపై విద్యార్ధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి రంగాల్లో అందించే శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు.
ఉద్యమానికి సిద్ధం కావాలి
అలంపూర్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కా రం కోసం ఉద్యమించాల్సిన అవసరముందని టీఎస్ యూటీఎ్‌ఫ్ జిల్లా అధ్యక్షుడు డి.రమేశ్ అన్నారు. పట్టణంలోని ఓ పాఠశాలలో నిర్వహించిన ఆ సంఘం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం పీఆర్సీని అమలు చేయడంతో పాటు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమానికి కార్యాచరణ చేపడతామన్నారు. కాగా, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంఈఓ అశోక్‌కుమార్, నాయకులు పి.రాముడు, కె.సుజ్ఞానం, మాబుసాబ్, రాజ్ కుమార్, వెంకటస్వామి, రాజశేఖర్, వెంకటమధుసూదన్, ఎల్లకృష్ణ, మధు నాయుడు, పెద్దయ్య నాయు డు, శాంసన్, శ్రీనివాసులు పాల్గొన్నారు.


