అలంపూర్ రూరల్: మండల పరిధిలోని క్యాతూర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఎలిశమ్మ ఆదివారం మృతి చెందారు. 11వ వార్డు కౌన్సిలర్ అయిన ఎలిశమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మరణించారు. అయితే మెరుగైన వైద్యం అందకపోవడంతో మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలు ఎలిశమ్మకు నలుగురు కుమార్తెలు, భర్త నరేందర్ ఉన్నారు. ప్రభుత్వం సదరు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.


