జాతీయ స్థాయికి నందిన్నె విద్యార్థి
కేటీదొడ్డి: జోగుళాంబ గద్వాల జిల్లా అథ్లెటిక్స్‌లో నందిన్నె గ్రామం మరోసారి సత్తాచాటింది. వచ్చేనెల 14, 15, 16 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 20వ జాతీయ స్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలకు నందిన్నె గ్రామానికి చెందిన విద్యార్థిని పవిత్రతోపాటు పలువురు క్రీడాకారులు వివిధ విభాగాల్లో ఎంపికయ్యారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలో ప్రతిష్టాత్మక ఓక్సేన్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనున్నాయి. జాతీయ స్థాయికి ఎంపికై న పవిత్ర ప్రతిభచాటి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తీన్మార్ మల్లన్న ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలి
గద్వాల న్యూటౌన్: తీన్మార్ మల్లన్న ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు అన్నారు. ఆదివారం వారు స్థానిక డీకే బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకొని మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో గౌడలను భయపెట్టి డబ్బులు వసూలు చేశారని చాలాసార్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయన్నారు. పార్టీలు మారే విషయంపై ఆయన మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ డికే అరుణ కుల మతాలకు అతీతంగా పనిచేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించిన ఆమెను విమర్శించే స్థాయి తీన్మార్ మల్లన్నకు లేదన్నారు. పాదయాత్రతో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ను సాధించి రైతుల కన్నీళ్లు తుడిచిన గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. గతంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ అయినా బీసీలకు కేటాయించారని చెప్పారు. సమావేశంలో నాయకులు రవికుమార్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
– వివరాలు 8లో..
– గోపాల్‌పేట
భోజనం వండకపోవడంతో పస్తులున్న విద్యార్థినులు
అస్వస్థతకు గురైన నలుగురు ఆస్పత్రిపాలు
పాఠశాలను సందర్శించిన మండల అధికారులు


