నడిగడ్డలో గోల్డ్‌మాల్‌..! | - | Sakshi
Sakshi News home page

నడిగడ్డలో గోల్డ్‌మాల్‌..!

Oct 5 2026 12:15 AM | Updated on Oct 5 2026 12:15 AM

గద్వాల క్రైం: అనుమతి లేని బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినా.. తాకట్టు పెట్టుకున్నా.. చట్టపరమైన చర్యలు తప్పవు అని చట్టం చెబుతుంది. అయితే వ్యాపారులు మాత్రం అదేం లేదు మీరు కొట్టుకొచ్చిన బంగారు ఆభరణాలే మా పెట్టుబడులుగా మార్చుకున్నాం. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అనే ధోరణిలో వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. నడిగడ్డలో యథేచ్ఛగా సాగుతున్న దొంగ బంగారం కొనుగోళ్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుర్తుతెలియని దుండగులతో వ్యాపారులు జతకట్టారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను తక్కువ ధరకే కొనుగోలు చేసి.. తిరిగి ఆ బంగారు ఆభరణాలను మార్కెట్‌ ధరలకు సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో అపహరించిన ఆభరణాల రికవరీ కోసం ఇటు ఆంధ్ర, అటు కర్ణాటక రాష్ట్రాల పోలీసులు నిత్యం తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది. తాజాగా ధరూరులోని ఓ జ్యువెలరీ షాపు యజమాని నుంచి రూ.4.50 లక్షల విలువైన 30 గ్రాముల బంగారు ఆభరణాలను కర్ణాటక పోలీసులు రికవరీ చేయడం చర్చనీయాంశమైంది.

దొంగలతో స్థానిక బంగారం వ్యాపారుల దోస్తీ

కొట్టుకొచ్చిన ఆభరణాలు యథేచ్ఛగా కొనుగోలు

అక్రమార్కులకు లాభసాటిగా మారిన వ్యాపారం

తాజాగా ధరూరులో కర్ణాటక పోలీసుల తనిఖీలు

ఓ వ్యాపారి నుంచి 30 గ్రాముల ఆభరణాలు రికవరీ

చర్యలు తీసుకోకపోవడంతో..

దొంగల నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వ్యాపారుల నుంచి పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉందనుకున్నా.. తర్వాత వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారులు ఎలాంటి భయం లేకుండా దొంగ బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. సాధారణంగా దొంగ బంగారం కొనుగోలు చేసినా.. విక్రయిచినా శిక్షార్హులు. అయితే కొందరు అధికారులు దీనిని బూచిగా చూపెడుతూ వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన ఆభరణాలు రికవరీ చేస్తూనే డబ్బులు లేదా ఎంతో కొంత విలువైన వాటిని లాగుతూ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిధిలో దొంగల నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన ఒక్క వ్యాపారిపై కూడా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే సదరు ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement