అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్‌ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి.
– దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్‌యూసీసీ మెంబర్


