అంతర్జాతీయ ఉగ్రవాద
దేశంగా అమెరికా..
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి, మహమూద్, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర, బుచ్చన్న, శంకర్‌రాజు, విజయ్, అనంతమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదాన్ని అంతమొందిస్తున్నామనే సాకుతో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద దేశంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయిల్‌కు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే స్వార్థంతోనే అమెరికా ఇలాంటి చర్యలకు పూనుకొంటుందని దుయ్యబట్టారు.
సీపీఎం రాష్ట్ర క్యార్యదర్శి జాన్‌వెస్లీ


