
యూరియా కోసం బారులు..
గట్టు:యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం పోలీస్ పహారా మధ్య గట్టు పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో ప్రతి రైతుకు 2 బస్తాల చొప్పున అందించారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ముందుగానే పీఏసీఎస్ దగ్గరకు చేరుకొని వరుసలో కవర్ల ద్వారా పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్‌లను పెట్టారు. వంతు వచ్చిన రైతులు వేలి ముద్ర వేసుకుని యూరియాను తీసుకెళ్లారు. ఒక్క రోజే 420 బస్తాలను రైతులకు అందజేసినట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు.