
స్వగ్రామం కంచుపాడు..
సురవరం సుధాకర్‌రెడ్డి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో మార్చి 25, 1942 సంవత్సరంలో జన్మించారు. సురవరం వెంకట్రామిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు సుధాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పుష్పలత నలుగురు సంతానం. కాగా అందరిలో పెద్దవాడైన సుధాకర్‌రెడ్డి విద్యాభ్యాసం కర్నూలు మున్సిపల్ పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఉస్మానియా కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. 1974 ఫిబ్రవరి 14న వివాహం కాగా.. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.