
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్‌యూబీలు
● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి
● భారీ వర్షాలతో అండర్
పాస్‌లకు పోటెత్తుతున్న వరద
● పలు గ్రామాలు, కాలనీలకు నిలిచిపోయిన రాకపోకలు
● ప్రత్యేక పైపులైన్ల ఏర్పాటును
పట్టించుకోని రైల్వే శాఖ
● డ్రెయినేజీల విస్తరణ,
అనుసంధానంపై నిర్లక్ష్యం
2022 జూలై 08: ఇది మహబూబ్‌నగర్ రూరల్ మండలం సూగురుగడ్డ రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా చేరిన వరద నీటి లో చిక్కుకున్న ఓ స్కూల్ బస్సు. ఆ సమయంలో 30 మంది విద్యార్థులు బస్సులో ఉండగా.. యువకుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పింది.
2025 ఆగస్ట్ 14: ఇది మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి)లోని రైల్వే అండర్ బ్రిడ్జి. భారీ వర్షంతో వరద పోటెత్తగా చెరువును తలపిస్తోంది. ఐదు రోజులుగా అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి.

‘యమ’డేంజర్..!