
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలనుకునే యువత, మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలిగేశ్వర్‌గౌడ్ తెలిపారు. ఈపథకం ద్వారా బ్యాంకు రుణాలతో పాటు కేంద్ర నిధుల నుంచి సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్ పోర్టల్ సేవలు నిలిచిపోయాయని, ప్రస్తుతం పునరుద్ధరించబడినందున ఆసక్తి గల అభ్యర్థులు httpr.www.kviconi ne.gov.in.pmefpŠobèltal ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఈపథకం ద్వారా జిల్లాలో మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
అలంపూర్ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ సిద్దప్ప అన్నారు. మండలంలోని క్యాతూర్ పీహెచ్‌సీని సందర్శించి ఫార్మసి గది, షేషెంట్స్ గది, రికార్డులను పరిశీలించారు. వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసన్న రాణి, వరలక్ష్మీ, భరత్, తిరుమల్ రెడ్డి, రామంజనేయులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
అయిజ: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ట్రాన్స్ కో ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను డీఈ తిరుపతిరావుతో కలిసి ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని 132 /33 కేవీ సబ్‌స్టేషన్‌లో 31.5 ఎంవీఏ శక్తిని 50 ఎంవీఏకు పెంచనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన టీవీ చానెల్ కేబుల్ వైర్లను డిష్ నిర్వాహకులు స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలను, విద్యుత్ తీగలను తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించకుంటే ప్రాణ నష్టం జరుగుతుందని, వీటి వల్ల విద్యుత్ సరఫరాకు తరుచూ అంతరాయం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో గోవిందు, ఏఈ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
గద్వాల యువతికి నాయక్, రస్తోగి అవార్డు
గద్వాల న్యూటౌన్: ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగానికి సంబధించి పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబాయి (ఐఐటీ ముంబాయి) వారు నాయక్, రస్తోగి అవార్డును 2012 నుంచి అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డును గద్వాలకు చెందిన కొంకతి ప్రీతి పొందారు. ఆసియాలోనే ప్రతిష్టత్మకమైన అవార్డులలో ఇది ఒకటి. యువతికి ఈ అవార్డు లభించడంపై వారి కుటుంబ సభ్యులు, పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు.