
సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పటిష్ట నిఘా
అయిజ: జిల్లా సరిహద్దు నుంచి ఇతర రాష్ట్రాలకు యూరియా, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేయకుండా పోలీస్ అధికారులు పహారా కాయాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగల్‌దిన్నె బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్‌ను మంగళవారం రాత్రి ఎస్పీ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియాను సరిహద్దు రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటలు నిఘా ఉంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ వెంట శాంతినగర్ సీఐ టాటాబాబు, అయిజ ఎస్సై శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.