
సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
గద్వాలటౌన్: బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కలెక్టర్ సంతోష్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు,బీసీ సంక్షేమ శాఖ అధికారిణి నుశిత, గౌడ్ సంఘం జిల్లా నాయకుడు శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ పార్టీల ఆధ్వర్యంలో...
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఇన్‌చార్జి సరిత ఘనంగా నివాళి అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. బీఆర్‌ఎస్ నాయకుడు హనుమంతు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ప్రజా సంఘాల నాయకడు ప్రభాకర్, నడిగడ్డ గౌడ్ సంఘం నాయకులు వేరువేరుగా నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.