
సమయపాలన తప్పనిసరి
మల్దకల్: ఉదయం 9నుంచి సాయంత్రం 4.30గంటల వరకు తప్పనిసరిగా విధులు నిర్వహించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సిద్దప్ప హెచ్చరించారు. సోమవారం మండలంలోని పాల్వాయిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కొంతమంది వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వారు తమ పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించడంతో పాటు గ్రామంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలన్నారు. ననీన్‌కుమార్, డీపీహెచ్‌ఎన్‌ఓ వరలక్ష్మీ, డీఎస్‌ఓ తిరుమలేష్ రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీధర్, ఏఎన్‌ఎం మనోహరమ్మ, ఆశాలు ఉన్నారు.