
జోగుళాంబ ఆలయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పూజలు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు చల్లా ఆదిత్యరెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు గోపాల్, నాయకులు రఘు రెడ్డి, సదానందమూర్తి, నాగేశ్వర్ రావు తదితరులు ఉన్నారు.
● ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సీజీఎం, అంబుడ్స్‌మెన్ డాక్టర్ సింగాల సుబ్బయ్య, పృథ్వీఫాల్గుణి, కిరణ్ జార్జ్‌లతో కలిసి గురువారం దర్శించుకున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాతం పలికారు. ఈ సందర్భంగా వారు శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు.
108 సేవలను
సద్వినియోగించుకోవాలి
గట్టు: ఆపద సమయంలో ఆదుకునేందుకు 108 సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని 108 జిల్లా అధికారి రత్నమయ్య తెలిపారు. గురువారం గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 వాహనాన్ని, రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు, మందులు తదితర వాటిని పరిశీలించారు. అత్యవసర సమయంలో 108కు కాల్ చేస్తే క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుంటుందని, ప్రజలు వీటి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనం పూర్తిగా సిద్ధంగా ఉండే విధంగా డ్రైవర్‌తో పాటుగా సిబ్బంది చూసుకోవాలని ఆదేశించారు.
క్షయ నిర్మూలనకు
ప్రత్యేక చర్యలు
గద్వాల క్రైం: క్షయ వ్యాధి నిర్మూలనకు వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. గురువారం క్షయ అనుమానితులకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్షయరహిత జిల్లాగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. అనంతరం పోస్టర్‌ను విడుదల చేశారు.