జోగుళాంబ గద్వాల
పకడ్బందీగా ధాన్యం కొనుగోలు
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025
ఫొటో తీస్తున్న
మిస్ ఇండియా
గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సంచుల్లో నింపి వెంటనే మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అవసరమైన ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గన్నీబ్యాగుల కొరత లేకుండా, వర్షాలు కురిసినప్పుడు ధాన్యం రక్షణకు టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఎస్‌వో స్వామికుమార్, డీఎం విమల, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఏవో సక్రియనాయక్ పాల్గొన్నారు.
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అర్హులైన వారికే ఇళ్ల కేటాయింపులు చేయాలని కలెక్టర్ అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల వారీగా లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేసి జాబితాను సిద్ధం చేయాలన్నారు. అర్హత లేనివారి గల కారణాలు వివరిస్తూ జాబితాలో పొందుపర్చాలన్నారు.
పారదర్శకంగా ‘యువ వికాసం’
లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలో రాజీవ్‌యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ప నిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీపీవో నాగేంద్రం, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్; ఎల్డీఎం శ్రీనివాసరావు, మున్సిపల్ కమీ నర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఈవీఎంల పరిశీలన
పటిష్ట భద్రత ఏర్పాట్లతో నిరంతరం ఈవీఎంలను భద్రపర్చాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూంలో ఈవీఎం యంత్రాలను పరిశీలించారు.
సమావేశంలో మాట్లాడుతున్న
కలెక్టర్ బీఎం సంతోష్
తళుక్కుమన్న సుందరీమణులు
● మహావృక్షాన్ని సందర్శించిన
మిస్‌వరల్డ్–25 పోటీదారులు
● 22 దేశాలకు చెందిన యువతుల రాక
● ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పర్యటన
జోగుళాంబ గద్వాల


