రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
గద్వాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై బీచుపల్లి నుంచి పుల్లూర్ జంక్షన్ వరకు ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించి బ్లాక్‌స్పాట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఎర్రవల్లి నుంచి గద్వాల వరకు ప్రమాదసూచిక బోర్డులు, హెచ్చరికలు సూచించే గుర్తులు, కల్వర్టుల మరమ్మతు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద రాత్రి వేళలో సరైన వెలుతురు స్పష్టమైన సైన్‌బోర్డులు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రజల ప్రాణభద్రతకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రోడ్డుప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని పట్టుకునేందుకు నిరంతరంగా డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, డీటీవో వెంకటరమణరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్ధప్ప, హిమాన్ష్‌గుప్త, ఎకై ్సజ్‌శాఖ, పంచాయతీశాఖ అధికారులు పాల్గొన్నారు.


