భక్తులకు సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

భక్తులకు సౌకర్యాలు కల్పించాలి

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

రేగొండ: బుగులోని జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా పార్కింగ్‌, విద్యుత్‌, వైద్య సేవలకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్‌ డీఈ రవికుమార్‌, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంపీఓ సురేష్‌, జాతర ఈఓ శ్రీనివాస్‌, చైర్మన్‌ రమణారెడ్డి, సర్పంచ్‌ సుదర్శన్‌, కాంగ్రెస్‌ నాయకుడు విజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement