నిస్సహాయులకు న్యాయ సహాయం అందించాలి | - | Sakshi
Sakshi News home page

నిస్సహాయులకు న్యాయ సహాయం అందించాలి

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

● సీనియర్‌ సివిల్‌ జడ్జి మహతి వైష్ణవి

భూపాలపల్లి అర్బన్‌: నిస్సహాయులకు న్యాయ సహాయం అందించడం అందరి బాధ్యత అని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.మహతి వైష్ణవి అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సీనియర్‌ సివిల్‌ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.అఖిల మాట్లాడుతూ.. పారా లీగల్‌ వలంటీర్లు, గ్రామ న్యాయ సహాయ కేంద్రాలు, శిక్షణ పొందిన మధ్యవర్తుల ద్వారా ప్రజలకు న్యాయ సహాయం అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్లీడర్‌ బొట్ల సుధాకర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సురేష్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, పరిపాలన అధికారి పారిజాతం, సూపరింటెండెంట్‌ రఘురాం, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement